Payal..టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్(Payal )తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. Rx-100 సినిమా ద్వారా మంచి క్రేజీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే బోల్డ్ గా నటించి కుర్రకారులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయింది. ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉండే సినిమాలలో రావడంతో ఈమె వచ్చిన అవకాశాన్నల్లా సద్వినియోగం చేసుకొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా తన ఇంస్టాగ్రామ్ కి తనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా తెలియజేసింది. అందుకు సంబంధించిన రెండు ఫోటోలను సైతం షేర్ చేసింది ఇందులో తన చేతికి సూది గుచ్చి ఉన్నటువంటి ఒక ఫోటోను షేర్ చేసింది దీంతో అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు అయితే ఆమె సమస్య గురించి తెలుసుకొని పర్వాలేదు తగ్గిపోతుందంటూ భరోసా కూడా ఇవ్వడం జరుగుతోంది. పాయల్ ఇలా రాసుకోస్తూ నేను చాలా తక్కువగా నీరు తాగడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యింది ఫలితంగా కాస్తనా ఆరోగ్యానికి గురయ్యాను ప్రస్తుతం ట్రీట్మెంట్ ముగిసింది చివరి యాంటీబయటిక్ డోస్ తీసుకున్నాను త్వరలోనే కం బ్యాక్ ఇస్తానని తెలియజేస్తోంది.
అయితే ఈమెకు ఉన్నట్టుండి ఇలా హెల్త్ ప్రాబ్లం పై అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఆందోళన పడ్డారు తన చేతికి సెలైన్ చూసి అందరూ తట్టుకోలేకపోతున్నారు. త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన పోస్ట్లు వైరల్ గా మారుతున్నాయి.
ఇక పాయల్ సినిమా విషయానికే వస్తే చివరిగా మంచు విష్ణు తో కలిసి జిన్నా సినిమాలో నటించింది.ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో గోల్ మాల్ సినిమాలు నటిస్తున్నది. అలాగే ఏంజెల్, కిరాతక వంటి సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం.
View this post on Instagram