టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ పాయల్ రాజ్ పుత్, ఆర్ ఎక్స్ 100 లో హీరోయిన్ గా నటించిన ఈ ఢిల్లీ భామ ఒకే ఒక్క సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. పాయల్ ఈ సినిమాలో కొన్ని బోల్డ్ మరియు ఘాటైన లిప్ లాక్ సీన్స్ లో నటించింది. పాయల్ అందాలకి కుర్ర కారు ఫిదా అయిపోయారు. తనకి ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీ లో అవకాశాలు బాగానే వచ్చి పడుతున్నాయి. స్టార్ హీరోల సరసన కూడా ఈ వయ్యారి కి ఆఫర్స్ వస్తున్నాయి. మొన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం పాయల్ ని సంప్రదించగా నో చెప్పిందని టాక్.
ఇక తాజాగా రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబో లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ లో ఒక ఐటెం సాంగ్ లో పాయల్ రాజ్ పుత్ ని నటించమని అడగ్గా ఆమె సున్నితంగా తిరస్కరించిందని టాలీవుడ్ లో ఒక వార్త వినిపిస్తుంది.
కేవలం సినిమాలో మొదటి హీరోయిన్ పాత్ర మాత్రమే చేస్తానని పాయల్ చెప్పటంతో సదరు నిర్మాతలు ఆశ్చర్య పోయారట. ఏదేమైనా పాయల్ సినిమాల ఎంపికలో మరి సెలెక్టివ్ గా వ్యవహరిస్తుందని ఇండస్ట్రీ లో టాక్.