ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారి చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. దీనితో ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా మరొక హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ ని గుర్తు పట్టడం కొంచెం కష్టం గానే ఉంది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత ఆర్డిఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా సినిమాల్లో నటించింది. సినిమాల విషయానికి వస్తే ఈమె తమిళం, పంజాబీ, కన్నడ తెలుగు భాషల్లో పలు ప్రాజెక్టులకు సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.