ప్రముఖ నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. గత కొద్దిరోజులుగా ఈమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పెను సంచలన పోస్ట్ షేర్ చేస్తూ తెలపడంతో ఈ పోస్టు కాస్త వైరల్ గా మారుతోంది. ఇంస్టాగ్రామ్ లో ఫోటోను షేర్ చేస్తూ శ్రేయోభిలాషులారా మీకోసం ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ ఒక విషయాన్ని రాసుకొచ్చింది.
నేను గత కొన్నేళ్లుగా గుండె ఇతరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను ఈ క్రమంలోనే వాటిని ఎదుర్కోవడానికి శక్తిని కూడగట్టుకునేందుకు బలం తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాను అంటూ తెలియజేసింది. నేను మాత్రమే కాదు నాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బలంగా నిలబడడానికి వారిలో సానుకూల దృక్పథం నింపేందుకే ఈ పోస్ట్ షేర్ చేస్తున్నానని తెలియజేస్తోంది రేణు దేశాయ్. ఎలాంటి పరిస్థితులలోనైనా సరే ఆత్మవిశ్వాసం అసలు కోల్పోవద్దు అంటూ తెలియజేస్తోంది. ఏదో ఒక రోజు మనకు తగిన ఫలితాలు కూడా లభిస్తుందని తెలుపుతోంది
జీవితంతో పాటు మనపై మనకు పూర్తి నమ్మకం ఉండాలి అప్పుడే ఈ ప్రపంచం మనకు ఎన్నో సర్ప్రైజ్లను ప్లాన్ ఉంచుతుంది. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా సరే వాటిని నవ్వుతూ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేస్తోంది.ఈ చికిత్సకు మెడిసిన్ కూడా తీసుకుంటున్నాను యోగా కూడా చేస్తున్నాను సరైన పోషకాహారం కూడా తింటున్నానని తెలియజేస్తోంది రేణు దేశాయ్. ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది. అవి ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు త్వరగా ఈమె కోలుకోవాలంటే సినీ ప్రముఖులు అభిమానులు పలువురు నేటిజెన్లు సైతం తెలియజేస్తున్నారు.
View this post on Instagram