తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురైనట్లు తాజా సమాచారం అందుతుంది. వరుస సినిమా షూటింగ్లో రాజకీయ వ్యవహారాలలో ఆయన తల మునకలు కావడంతో ఇలా అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.. ఆయన అస్వస్థకు గురి కావడంతో ఈ మధ్య ప్రారంభం కావాల్సిన తమిళ చిత్రం వినోదయ సీతం రీమేక్ షూటింగ్ కూడా వాయిదా పడింది. ఈ సినిమా కోసం గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన డైట్ తీసుకుంటున్నారు. బరువు తగ్గాల్సి రావడంతో ఆయన స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు ఫిలిం వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకే ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. జనవరి వరకు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి ఓ జి , వినోదయ సీతం కి రీమేక్ డేట్స్ కేటాయించాడు. ఈ సమయంలోనే ఆయన డైట్ ఫాలో కావడంతో అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో వచ్చే నెల నుంచి చేపట్టాలనుకున్న వారాహి యాత్ర కూడా పోస్ట్ పోన్ అయ్యే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.
చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ ఫినిష్ చేసి ఎన్నికలలోకి వెళ్లాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే అనారోగ్యానికి గురి అవ్వడంతో అటు జనసేన అభిమానులు ఇటు కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అనారోగ్యం కారణంగానే తారకరత్న అంత్యక్రియలకు వెళ్లలేక పోయారు అని సమాచారం. ఏదేమైనా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని సినిమాల షూటింగ్ కంప్లీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.