Pawan Kalyan.. తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఉగాది నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుందనే విషయం తెలిసినదే.. శుభకృతి నామ సంవత్సరం తమకు కలిసి రావాలని ప్రతి రాజకీయ నాయకుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు కూడా మొదట ఎమ్మెల్యే కావాలని ఆ తర్వాత భవిష్యత్తులో సీఎం కావాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక నెరవేరుతోందో లేదో కొంతమంది జ్యోతిష్యులు తెలిపిన ప్రకారం తెలుసుకుందాం.
రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని పవన్ కళ్యాణ్ జాతకంలో సీఎం అయ్యే యోగం ఉందని కాలం కలిసి వస్తే పవన్ సీఎం కావడం పెద్ద కష్టమేమీ కాదనే వార్తలు వినిపిస్తున్నాయి.. జనసేన ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందని కూడా జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. జనసేన ఎలా పోటీ చేసిన అనుకూల ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉందని కొంతమంది జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పవన్ కు రాజయోగం ఉందని వాళ్ళు చెబుతున్నారు.
మరొకవైపు పవన్ కళ్యాణ్ సినిమాలలో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలను చేసుకుంటూ ఉన్నారు. మొదట విడుదలఏ సినిమాను చేస్తారో చూడాలినీ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తూ ఉండడంతో రెమ్యూనరేషన్ కూడా సినిమా సినిమాకి పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రోజుకి రూ .2 కోట్ల రూపాయల రేంజ్లో పారితోషకం తీసుకున్నట్లు స్వయంగా తానే తెలియజేశారు.
నిన్నటి రోజున ఉగాది పండుగ సందర్భంగా పవన్ సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు భావించక అది మాత్రం జరగలేదు. మరి పవన్ కళ్యాణ్ కు సినీ సెలబ్రిటీలలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మరి ఏ మేరకు ఈసారి ఎలక్షన్లలలో గెలుస్తారో చూడాలి మరి.