హరి కృష్ణ మృతి పై పవన్ కీలక నిర్ణయం

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటుడు, మాజీ రాజ్య సభ సభ్యుడు హరి కృష్ణ మరణ వార్త తెలుసుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. అయన ఉదయం కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయ పడ్డారని తెలుసుకున్న, అయితే క్షేమంగా బయట పడతారని అనుకున్న కానీ కొద్దీ సేపటికే ఈ చేదు వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు అని అయన జన సేన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలిపారు.

హరి కృష్ణ గారి మృతికి సంతాపసూచికంగా ఇవాళ జన సేన పార్టీ అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇవాళ కొంత మంది ముఖ్య నాయకుల చేరికలు, మరియు గిడుగు రాంమూర్తి జయంతి వేడుకల్ని రద్దు చేసినట్టు ప్రెస్ నోట్ విడుదల చేసారు జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

Share.