అగ్ర కథానాయకులు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఖరారైంది. ఈ మూవీ టైటిల్‌ని ఆగస్టు 15వ తేదీన అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టైటిల్‌ని ‘భీమ్లా నాయక్’ అని ప్రకటించారు. అలాగే పవన్‌కల్యాణ్ పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్ విడుదల చేశాడు. ఈ వీడియోలో పవన్‌కల్యాణ్ లుంగీ ధరించి మాస్ అవతారంలో కనిపించి పూనకాలు తెప్పించారు. “రేయ్, డేని.. బయటికి రారా!” అంటూ పవర్‌ఫుల్ ఎంట్రీ ఇస్తూ పవన్ లుంగీ పైకెత్తి రౌడీలను చితక్కొట్టడం చూడొచ్చు.
ఇక ‘డేనియల్ శేఖర్’ అని రానా తన పేరు పరిచయం చేసుకోగా.. పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్ తో కేక పుట్టించారు. మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 2022, జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా అనగా సెప్టెంబర్ 2 నుంచి ‘భీమ్లానాయక్’ పాటలు రిలీజ్ అవుతాయి.