పవన్ ఈజ్ బ్యాక్..సంబరాల్లో ఫ్యాన్స్!

Google+ Pinterest LinkedIn Tumblr +

మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ముగినిపోయిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఆ పార్టీ తరుపు నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఛేదు అనుభవం పొందారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మూవీ తర్వాత పవన్ కళ్యాన్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లారు. లోక్ సభ-రాజ్యసభ స్థానాలకు తన అభ్యర్థులను నిలిపారు.

కానీ ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి. ఒకే ఒక్క సీటుకే జనసేన పరిమితం అయ్యింది.
మొన్నటి వరకు ఏపిలో పార్టీ అంతగా డ్యామేజ్ కావడానికి గల కారణాలపై సమీక్షలు నిర్వహించారు. మొన్నటి వరకు ప్రచారంలో భాగంగా గుబురు గడ్డంతో కనిపించిన పవన్ ఇప్పుడు ట్రిమ్మింగ్ చేసుకొని చాలా స్మార్ట్ లుక్ తో కనిపిస్తున్నారు.

త్వరలో ఆయన మల్లీ తెరపైకి రాబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన గళ్ల చొక్కా దరించి..ఓ పాపతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా పవన్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరాలు జరుపుకుంటున్నారు.

Share.