శివశంకర్ మాస్టర్ మృతిపై స్పందించిన బాలకృష్ణ,పవన్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ తాజాగా అనారోగ్యం కారణంగా తాజాగా మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కరోనా బారినపడి ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. శివ శంకర్ మాస్టర్ అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు అతనికి సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. శివశంకర్ మాస్టర్ మరణం బాధాకరమని, కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించానని పవన్ తెలిపారు. శాస్త్రీయ నృత్యంలో పట్టు ఉన్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారని కొనియాడారు.రామ్‌చరణ్ మగధీరలో శివశంకర్ మాస్టర్ డాన్సలు అందించిన పాట ప్రేక్షకులకు సంతోషాన్ని ఇవ్వడమే కాక ఆయనకు జాతీయ పురస్కారాన్ని అందించడం గొప్ప విషయమన్నారు.

శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు లేఖలో పవన్ పేర్కొన్నారు.శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మహా ప్రస్థానంలో జరగనున్నాయి. ఇక ఆయన లేరన్న వార్త తెలిసిన చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో దర్శకుడు రాజమౌళి తో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Share.