పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ చాలా సంవత్సరాల నుంచి మంచి అనుబంధంగా ఉన్నది. గతంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఆలీ కాంబినేషన్లో సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. పవన్ తో సినిమాలను తెరకెక్కించే దర్శకులకు కూడా ఆలీ ఖచ్చితంగా తన చిత్రంలో ఉండేలా సలహాలు ఇస్తూ ఉండేవారని సమాచారం. అయితే ఈమధ్య ఆలీ, పవన్ మధ్య విభేదాలు పెరిగిపోయాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
తాజాగా ఈ విషయంపై కమెడియన్ ఆలీ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ఆలీ బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి షో ఆలీతో సరదాగా షోకి గెస్ట్ గా రావడం జరిగింది. ఇందులో పవన్ తో విభేదాలపై మాట్లాడుతూ.. పవన్ తో విభేదాలు అనే మాట అవాస్తవం.. అది కావాలని ఎవరు గిట్టని వాళ్లు సృష్టించారని.. తెలియజేశారు. ఇక ఆలీ కూతురు పెళ్లి (ఫాతిమా ) కి పవన్ కళ్యాణ్ పిలవడం జరిగింది.పవన్ కూడా వస్తానని చెప్పారు. అయితే తను వేరేచోట ఉండడం చేత ఫ్లైట్ చిక్కడం ఆలస్యం కావడంతో పెళ్లికి హాజరు కాలేకపోయారని తెలియజేశారు ఆలీ. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో నటిస్తు బిజీగా ఉంటున్నారు.
అయితే ఆలీ ఇచ్చిన ఈ క్లారిటీ పైన కొంతమంది అభిమానులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆలీతో సరదాగా చివరి ఎపిసోడ్లో యాంకర్ సుమ ఆలేని పలు ప్రశ్నలు వేసి తన గురించి తెలియని విషయాలను సైతం తెలియజేసేలా చేసింది. వైసిపి తరఫున ఆలీ పదవి పొందడం వల్ల పవన్ ,ఆలీ మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ వార్తలలో నిజం ఉందని విషయం తెలియాలి అంటే పవన్ కూడా స్పందించాల్సి ఉంటుంది.