తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మొదలుపెట్టిన హరితహారం రోజురోజుకీ మంచి ఆదరణ సంపాదిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదొక ట్రెండ్‌గా మారింది. ఇటీవల సెలిబ్రిటీలు ఈ కార్యక్రమాన్ని గ్రీన్ ఛాలెంజ్‌గా తీసుకుని తాము చేయడమే కాకుండా ఇతర సెలిబ్రిటీలను నామినేట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి కూడా స్వీకరించారు.
ఎన్‌టీవీ అధినేత శ్రీ నరేంద్రనాథ్ చౌదరి ఇచ్చిన ఛాలెంజ్‌ను చిరు స్వీకరించి మూడు మొక్కలను నాటారు. దీంతో పాటు ఆయన మరో ముగ్గురిని ఈ గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. ఇందులో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఈనాడు గ్రూప్ చైర్మెన్ రామోజీ రావు మరియు తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే అన్నయ్య చిరంజీవి విసిరిన సవాల్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంటనే స్వీకరించి మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇలా మెగాస్టార్ ఇచ్చిన సవాల్‌ను కొన్ని గంటల్లోనే ఫినిష్ చేసి పవన్ తన మార్క్ ఏమిటో చూపించాడు. మొత్తానికి గ్రీన్ ఛాలెంజ్ పుణ్యమా అని సెలిబ్రిటీలు సైతం మొక్కలు నాటడం పర్యావరణ ప్రేమికులను ఆకర్షిస్తోంది.