Pavitra తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన వారిలో నటులలో నరేష్(Pavitra), పవిత్ర జంట ఒకరని చెప్పవచ్చు.. వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాము అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. నరేష్, పవిత్ర గురించి తరచూ ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా నటి పవిత్ర హీరో రాజేంద్రప్రసాద్ కు వరుసకు మరదలు అవుతుందనే విషయం చాలా వైరల్ గా మారుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.
పవిత్ర, రాజేంద్రప్రసాద్ కు మరదలు కావడం ఏంటా అనుకుంటున్నారా.. తాజాగా నరేష్ ,రాజేంద్రప్రసాద్, నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్ని మంచి శకునాలే సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రప్రసాద్ నరేష్ ను దగ్గరికి తీసుకొని నిత్య పెళ్లి కొడుకుల ఉన్నారు అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. అలాగె తనకు నరేష్ తమ్ముడు వరస అవుతారంటూ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
ఇ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది నరేష్ నిత్య పెళ్లికొడుకు అంటూ రాజేంద్రప్రసాద్ చేసిన వాక్యాలు సంచలనంగా మారాయి అయితే కొందరు మాత్రం ఈ విషయాన్ని ఫన్నీ కామెంట్లతో తెరపైకి తీసుకురావడం జరిగింది.. రాజేంద్రప్రసాద్ మాటల ప్రకారం తనకు నరేష్ తమ్ముడు వరస అవుతారంటే నరేష్ తో రిలేషన్ లో ఉన్నటువంటి పవిత్ర రాజేంద్రప్రసాద్ కు మరదలు అవుతుంది అంటూ పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇలా పవిత్ర బావ మరదలు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భాగంగా వీరిద్దరు పెళ్లి చేసుకున్నటువంటి ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది..