పవన్ వాయిస్ తోనే సైరా టీజర్..ఫ్యాన్స్ కి పండగే..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా మేకింగ్ వీడియో రీసెంట్ గా రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఆగష్టు 22న చిరంజీవి బర్త్ డే కానుకగా రెండు రోజుల ముందే అనగా ఆగష్టు 20నే సైరా టీజర్ రాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ టీజర్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని తెలుస్తుంది.

మెగాస్టార్ సినిమాకు పవర్ స్టార్ వాయిస్ అబ్బో మెగా ఫ్యాన్స్ కు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. నిన్న మొన్న పవన్ వాయిస్ తోనే సైరా టీజర్ వస్తుందని వార్తలు వచ్చాయి. కాని వాటికి ప్రూఫ్ లేదు. కాని ఇప్పుడు పవన్ వాయిస్ ఇస్తుండగా చిరు, సైరా డైరక్టర్ సురేందర్ రెడ్డి కూడా పక్కన ఉన్నారు. ఇది చూసి ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. మరి పవర్ స్టార్ వాయిస్ తో వస్తున్న సైరా టీజర్ ఎలా ఉంటుంది.

ఓన్లీ టీజర్ వరకే పవన్ వాయిస్ ఇచ్చాడా లేక సినిమాలో కూడా అతని వాయిస్ ఉంటుందా.. ఇలాంటి డౌట్స్ క్లియర్ అవ్వాలంటే మాత్రం అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆగష్టు 20 మెగా ఫ్యాన్స్ కు పెద్ద పండుగ అని చెప్పొచ్చు. మేకింగ్ వీడియోలో యాక్షన్ పార్ట్ హైలెట్ గా నిలిచింది. టీజర్ లో చిరు భారీ డైలాగ్ కూడా ఉంటుందట. మొత్తానికి రెండు నెలల ముందు నుడే సైరాపై కావాల్సినంత క్రేజ్ ఏర్పడేలా చేస్తున్నారు మూవీ యూనిట్.

Share.