కాజల్ అగర్వాల్ సినిమాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచిన తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుసగా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఆఫర్స్ ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ 150 లో, మరియు తమిళ హీరో విజయ్ తో మెర్సెల్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక మొన్న వచ్చిన ‘అ’ సినిమాతో మరో సారి తన నటనతో ప్రేక్షకులని అలరించింది. ఇక ఇప్పుడు తాజాగా పారిస్ పారిస్ అనే ఒక తమిళ చిత్రం లో నటిస్తుంది కాజల్. షూటింగ్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రస్తుతం పారిస్ లో కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కాజల్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ని ఈఫిల్ టవర్ వద్ద కష్ట పడి ఫోటో తీస్తున్న ఫోటో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటో ని షేర్ చేసారు.
కాజల్ ఫోటో తీస్తున్న వ్యక్తి ఎవరో మిరే చూడండి..
Share.