వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. పంతం నెగ్గని గోపీచంద్!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీగా తెరకెక్కిన పంతం చిత్రంపై అటు ప్రేక్షకులతో పాటు ఇటు సినీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో గోపీచంద్ తన కెరీర్‌లో మరో హిట్‌ను సొంతం చేసుకోవడం పక్కా అని ఫిక్స్ అయ్యారు అందరు. ఇక ఈ సినిమాలో మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాతో ఖచ్చితంగా గోపీచంద్ సక్సెస్ కొట్టాలనే పంతం నెగ్గుతాడని అనుకన్నారు అందరు.

కానీ సినిమా రిలీజ్ తరువాత ఫలితం మారిపోయింది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో గోపీచంద్ తన కెరీర్‌లో హిట్ కొడతాడని అనుకన్నారు అందరు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ సంపాదించుకున్నా దానిని ఫుల్ రన్‌లో కలెక్షన్స్ రాబట్టడంలో ఉపయోగించలేకపోయింది. దీంతో ఈ సినిమా కూడా గోపీచంద్ గత చిత్రాలలాగా డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా టోటల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.9.12 కోట్లు మాత్రమే రాబట్టడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్ర ఏరియాల వారీ క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – క్లోజింగ్ షేర్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 2.82
సీడెడ్ – 1.45
ఉత్తరాంధ్ర – 1.25
గుంటూరు – 0.78
ఈస్ట్ – 0.62
వెస్ట్ – 0.53
కృష్ణా – 0.60
నెల్లూరు – 0.35
టోటల్ ఏపీ+తెలంగాణ – 8.4 కోట్లు
కర్ణాటక – 0.45
యూఎస్ – 0.17
రెస్టాఫ్ ఇండియా – 0.10
టోటల్ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్: 9.12 కోట్లు

Share.