సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం పెద్దన్న. ఈ సినిమాలో నయనతార, మీనా, కీర్తి సురేష్ వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాను డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జగపతి బాబు కూడా నటించడం విశేషం. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పెద్దన్న సినిమా ఎలాంటి ఆర్బాటం లేకుండా విడుదల అయింది. ఈ సినిమా ప్రేక్షకులను అభిమానులను నిరాశ చెందినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా కూడా మిగిలింది. అయితే ఈ సినిమానే త్వరలోనే ఓటిటిలో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ లో ఈ నెల 26వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.
డైరెక్టర్ శివా తో రజనీకాంత్ కలిసి నటించిన మొదటి చిత్రం ఇదే. ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా డి.ఇమ్మాన్ అందించాడు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో రజినీకాంత్ సినిమాలకు దూరంగా ఉండబోతుందని వార్త కూడా బాగా వినిపించింది. అయితే మరికొందరు మాత్రం ఆయన ఆరోగ్యం సరిగా లేక సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడని తెలియజేస్తున్నారు.