మోహన్ లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం మారక్కర్. ఇప్పుడంటే ఈ సినిమాని డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కించారు. ఈ సినిమా పురాణ చారిత్రాత్మక యుద్ధం మూవీ గా తెరకెక్కించ బడింది. ఈ సినిమాని శశి సహా రచయితగా చేశారు. ముని షాట్ ఎంటర్టైన్మెంట్ మరియు కాన్ఫిడెంట్ గ్రూప్ సహనిర్మాతలు గా.. ఆశీర్వాద్ సినిమాస్ మూవీస్ ను నిర్మించారు.
ఈ మూవీలో అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, మోహన్ లాల్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫాం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 17వ తేదీన ప్రసారం కానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు గా హిందీ తెలుగు తమిళ భాషలలో కూడా ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా మలయాళం లోనే అత్యధికంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి పేర్కొంది. అంతేకాకుండా ఈ సినిమాకు అవార్డు కూడా లభించింది.