సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల ఓటీటి అప్డేట్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

వచ్చేయేడదికి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు కొన్ని బడా చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అందులో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలతో పాటు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ,విజయ్ నటిచ్చిన వారసుడు చిత్రాల తో పాటు కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు మొత్తం రూ .100 కోట్లకు పైగా పెట్టుబడి తో తెరకెక్కించడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలు రూ.100 కోట్ల వసూలను నమోదు చేసి అవకాశం ఉందని చాలా ధీమాతో ఉన్నారు చిత్ర బృందం.

Sankranthi Releases: Over budget for all three Films

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూడు చిత్రాలు కూడా థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటిలో విడుదలబోతున్నట్లుగా సమాచారం. ఈ మధ్యకాలంలో నిర్మాతలు మండలి వారు సరికొత్త నిర్ణయాలు తీసుకువచ్చిన సంగతి తెలిసినదే ఈ మూడు సినిమాలలో ఏ సినిమా సక్సెస్ అయిన కూడా ఓటీటి లో చూడాలి అంటే కచ్చితంగా 50 రోజులు ఆగాల్సిందే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ చిత్రాలకు సంబంధించి విడుదల తేదీ విషయంలో ఒక క్లారిటీ రావడం జరిగింది..

సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రాలను ఓటీటి లో చూడాలి అంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాలా అంటూ అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం కచ్చితంగా ఈ చిత్రాలను ప్రేక్షకులు థియేటర్లలో చూడాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి,బాలయ్య సినిమాల విషయంలో నిర్మాతలు చాలా నమ్మకంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి అంటే నిర్మాతలకు మంచి లాభాలు వస్తాయని చెప్పవచ్చు. ఏదిఏమైనా సినిమాలు విడుదలైన తర్వాత 50 రోజుల కు ఓటీటిలో వస్తాయనే విషయం అభిమానులకు తెలియగానే కాస్త నిరుత్సాహ పడుతున్నారు.

Share.