తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఎంతో మందికి డబ్బింగ్ చెప్పి మంచి పేరు తెచ్చుకున్న నటుడు సాయి కుమార్. నటుడిగా ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న సాయికుమార్ తనయుడు ఆది సాయికిరణ్ హీరోగా ‘ప్రేమ కావాలి’సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా కలిసి రాలేదు. ఆ మద్య నెక్ట్స్ నువ్వే సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు అడివి సాయికిరణ్ రూపొందిస్తోన్న తాజా మూవీ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ఈ సినిమా టీజర్ ని హీరో మహేష్ బాబు విడుదల చేశారు.
నలుగురు స్నేహితులు, ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఘాజీబాబా అనే తీవ్రవాది ఇలా ఇండియా-పాకిస్తాన్ మధ్య నడిచే కథగా టీజర్ కట్ చేశారు. “హూ ఈజ్ ది గోల్డ్ ఫిష్?” అంటూ ఆది ఎవరినో వెతుకుతూ ఉంటాడు. ఈ సినిమాలో రచయిత అబ్బూరి రవి కరుడుగట్టిన తీవ్రవాది ఘాజీబాబా పాత్రలో నటించారు. ‘కాశ్మీర్ పాకిస్తాన్ దే” అంటూ అందరూ తవ్రవాదులు చెప్పే అరిగిపోయిన రికార్డ్ వల్లె వేస్తుంటాడు.
ఒకవైపు అనిష్ కురువిల్లా “యూ కెనాట్ కిల్ ఘాజీ బాబా”అంటూ ఉంటే.. ఆది మాత్రం ఆయనకోసం తీవ్రంగా గాలిస్తూ ఉంటాడు.. ‘ఏక్ హిందుస్తాని కభీ వాదా నహీ తోడ్తా’ అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా చెప్తాడు. ఈ సినిమాలో శషా చెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ కీలక ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.