కోలీవుడ్ స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న మాధవన్ సినిమా ఎంపిక చేసుకోవడంలో.. క్యారెక్టరైజేషన్ లో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు. క్యారెక్టర్ మంచిది దొరకాలే కానీ ఆయన తెలుగు, తమిళ్ , హిందీ, మలయాళం ఏ భాష చూడకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆయన కొడుకు మాత్రం సినీ ఇండస్ట్రీ లోకి రాకుండా భిన్నంగా వేరే మార్గంలో వెళుతూ ఉండడం గమనార్హం . అయితే ఇందుకు మాధవన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సాధారణంగా భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఏ ప్రాంతానికి చెందిన సినీ ఇండస్ట్రీలో అయినా.. హీరోలు తమ కొడుకులను తమ వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు సినీ రంగంవైపు ప్రోత్సహిస్తున్నారు..
కానీ మాధవన్ మాత్రం అందుకు భిన్నంగా తన కొడుకు వేదాంత్ వేరే రంగంవైపు ప్రాధాన్యం ఇస్తున్నాడు. మాధవన్ కొడుకు వేదాంత్ నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ ఛాంపియన్. మహారాష్ట్రలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో ఏడు మెడల్స్ ను గెలుచుకున్నాడు. ఇక భారత్ తరఫున వేదాంత్ 2026 ఒలంపిక్స్ లో ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. అందుకే కొడుకు కెరీర్ కోసం మాధవన్ చాలా కష్టపడుతున్న ట్లు సమాచారం.. కొవిడ్ ఆంక్షల కారణంగా భారతదేశంలో ఒలంపిక్స్ స్థాయి స్విమ్మింగ్ ఫూల్స్అందుబాటులో లేవు కాబట్టి కొడుకుకు శిక్షణ ఇప్పించడానికి తన భార్య సరితతో కలిసి దుబాయ్ కి వెళ్తున్నారు మాధవన్.