ఆలివ్ ఆయిల్ తో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆలివ్ ఆయిల్ ను ఎక్కువగా సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా మనం తెలుసుకుందాం.. కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసి , తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటూ ఉండటం వల్ల జలుబు ,దగ్గు మాయం అవుతాయి. అంతేకాదు ఈ ఆలివ్ ఆయిల్లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి ముఖం మీద మొటిమలు ఉన్న చోట అప్లై చేయడం వల్ల రెండు మూడు రోజుల్లోనే మొటిమలు తగ్గుముఖం పట్టడం గమనించవచ్చు.

దాల్చిన చెక్క ను నూరి, నిమ్మరసంతో కలిపి మచ్చల మీద అప్లై చేస్తే నల్లటి మచ్చలు ఉంటే దూరమవుతాయి.దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ , లవణ చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని , రోజూ రెండుసార్లు ఆహారం తరువాత అర గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. పావు కప్పు ఆలివ్ నూనెను వేడిచేసి మూడు స్పూన్ల తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. వారానికి ఒకటి రెండు సార్లు ఈ విధంగా చేయాలి.

Share.