సింగర్ సిద్ శ్రీరామ్.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి సినీ ఇండస్ట్రీలో గాయకులకు అంతగా క్రేజ్ ఉండదనే చెప్పాలి.. ముఖ్యంగా ఎస్పీ బాలు, ఏసుదాస్ అయితే తప్ప ఇప్పుడు వస్తున్న గాయకులకు పెద్దగా అభిమానులు ఉండరనే చెప్పాలి.. కానీ ఒక సింగర్ అలాంటి అభిమానులను సొంతం చేసుకున్నాడు.. సాధారణ గాయకుడిగా వచ్చినా ఇప్పుడు అసాధారణ గాయకుడు అయిపోయాడు. కార్తీక్, సోను నిగం లాంటి గాయకులకు వున్న ఫ్యాన్ బేస్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పవచ్చు. ఆ తర్వాత అంతే స్థాయిలో మాయ చేసిన సింగర్.. సిద్ శ్రీరామ్ మాత్రమే అని చెప్పాలి. సౌత్ ఇండియా లో మోస్ట్ వాంటెడ్ సింగర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
సిద్ శ్రీరామ్ గొంతులో దేవుడు ఏం పెట్టాడో తెలియదు కానీ.. ఏది పాడినా అలా సెట్ అవుతుంది అంటే, ఏదో అమృతం పోసినట్టుగా వినడానికి చాలా హాయిగా ఉంటుంది.. సిద్ శ్రీరామ్ పాటలు వింటున్న అభిమానులు అంటున్న మాటలు ఇవే.. ఒక పాట అయితే ఏమో అనుకోవచ్చు.. కానీ ఈయన పాడుతున్న ప్రతి పాట కూడా అంతే స్థాయిలో హిట్ అవుతూ ఉండడం గమనార్హం. అందుకే ఆయనతో ఒక్క పాట అయినా సరే పాడించాలని అంటున్నారు సంగీత దర్శకులు.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా లో నీలి నీలి ఆకాశం అనే పాట , శశి సినిమాలో ఒకే ఒక లోకం నువ్వే, అల వైకుంఠ పురం లో సామజ వరగమన, గీత గోవిందం లో ఇంకేం ఇంకేం కావాలి.. ఇలా ప్రతి పాట కూడా సూపర్ హిట్ గా నిలిచింది..
ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈయన ఒక పాటకు ఎంత తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే అక్షరాలా రూ.4.5 లక్షలు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఏది ఏమైనా సిద్ శ్రీరామ్ అంటే అంతే అంటున్నారు ఆయన అభిమానులు.