సమంత ఈ పేరు వింటుంటే..సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ అని అంటుంటారు. ఏం మాయచేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ మాలీవుడ్ బ్యూటీ తర్వాత టాప్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిపోయింది. అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం సమంత నటించిన సినిమాలు వరుస విజయాలు అందుకుంటున్నాయి.
తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న రీమేక్ మూవీ ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలు అనుకోకుండా 20 ఏళ్ల వయసున్న యువతి మారిపోతే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని కామెడీ, సెంటిమెంట్ జోనర్ లో తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
70 ఏళ్ల మహిళ పాత్రలో సినియర్ నటి లక్ష్మీ నటిస్తున్నారు. షూటింగ్ అంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి కీలక పాత్రల్లో నటించారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్సాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.