నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో రిలీజ్ అయిన ‘ఓ బేబీ’ చిత్రం మార్నింగ్ షో నుండే మంచి పాజిటివ్ టాక్ తో అంచనాలను అందుకొని ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు పెంచూకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. కొరియన్ మూవీ రిమేక్ గా వచ్చిన ఓ బేబీ మూవీలో సమంత ఓ ప్రయోగాత్మక పాత్రలో నటించింది.
25 అమ్మాయిగా ఉంటూనే 75 ఏళ్ల భామ పాత్రలో అద్భుత నటన ప్రదర్శించింది. సమంత లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీని సురేష్ ప్రోడక్షన్స్ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు.టెక్నికల్ పరంగా.. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ త్రయం ‘ఓ బేబీ’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్లోనే చాలా రిచ్‌గా చూపించారు.ఇక తాజా ట్రేడ్ సమాచారం ప్రకారం ఈ సినిమా తొలి వీకెండ్ లో సుమారు రూ 17 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.