తారక్ న్యూ లుక్ చూశారా.. ఫొటోలు వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. ఇటీవల చిత్రబృందంతో కలిసి షూటింగ్ నిమిత్తం ఉక్రెయిన్ వెళ్లిన తారక్ తాజాగా హైదరాబాద్‌కు వచ్చేశారు. తన పాత్రకు సంబంధించిన సీన్ల చిత్రీకరణ పూర్తి కావడంతో తారక్ తిరిగి ఇంటికి రాగా, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చారు.
వైట్ టీ షర్ట్, జీన్స్ ప్యాంట్, బ్లాక్ కలర్ మాస్కు, క్యాప్ ధరించి తారక్ చాలా క్యాజువల్‌గా కనిపించగా, మీడియా వారు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను క్లిక్ మనిపించారు. ప్రజెంట్ ఆ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇక తారక్, చెర్రీపై రాజమౌళి ఇటీవల సాంగ్ చిత్రీకరణ పూర్తి చేశారని సమాచారం.

ఈ ఫిల్మ్‌లో తారక్ సరసన ఒలివియా నటిస్తుండగా, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత తారక్, చెర్రీ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అవుతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆల్రెడీ నెక్స్ట్ మూవీస్ పాన్ ఇండియా వైడ్ అని అనౌన్స్ కూడా చేసేశారు మేకర్స్.

Share.