తెలుగు ఇండస్ట్రీలో మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రామ్ చరణ్ ని వివాహం చేసుకొని చాలా రోజుల తర్వాత ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.అంతేకాకుండా మెగాస్టార్ ఇంటికి వారసుడు రాబోతున్నాడు . ఇటీవల ఉపాసన శ్రీమంతం కూడా జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు వ్యక్తులు హాజరయ్యారు అందులో జూనియర్ ఎన్టీఆర్,లక్ష్మీ ప్రణతి కూడా వచ్చారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ వీరిద్దరూ నటించినా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు. అంతేకాకుండా ఈ సినిమా కంటే ముందే వీరిద్దరూ మంచి స్నేహితులు ఎన్టీఆర్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా రామ్ చరణ్ ఫ్యామిలీ వెళుతూ ఉంటుంది. అలాగే రామ్ చరణ్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఎన్టీఆర్ ఫ్యామిలీ హాజరవుతారు. అంతేకాకుండా రామ్ చరణ్ ప్రతి పుట్టినరోజుకు ఎన్టీఆర్ ఖచ్చితంగా వెళ్తుంటారు. అలాగే ఉపాసన శ్రీమంతం ఫంక్షన్ కి కూడా ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వచ్చి తన చేతులతో చేసిన స్వీట్లు ఉపాసనకు బహుమతిగా ఇచ్చారు .
ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి స్వీట్స్ బాగా చేస్తుందట. అంతేకాకుండా ఆమె చేసిన స్వీట్స్ ఉపాసనకు చాలా ఇష్టమట. తన మీద ప్రేమతో ఇంతలా కష్టపడి స్వీట్ తయారు చేసి తీసుకు వచ్చిన లక్ష్మీ ప్రణతికి ఉపాసన థాంక్స్ చెప్పింది. ప్రణతి పంపిన గిఫ్ట్స్ బాక్స్ లో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. ఒకటి డ్రై ఫ్రూట్స్ స్వీట్ తో పాటు రకరకాల స్వీట్లు తయారుచేసి పంపింది. ప్రణతి తను ఉపాసనకు పంపించిన స్వీట్లు చూస్తుంటే ఉపాసనపై లక్ష్మీ ప్రణతికి ఎంత ఇష్టమో తెలుస్తోంది. కష్టపడి లక్ష్మీ ప్రణతి ఇన్ని స్వీట్లు చేసి పంపించింది. అంటూ నేటిజెన్లు సోషల్ మీడియాలో ఈ విషయం పై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.