తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరును క్రేజీను సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నాడు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సినిమాలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ అవార్డు తీసుకోవడానికి చిత్ర బృందం మొత్తం అమెరికాకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నాకు నాటు నాటు పాటకి ఇంత మంచి అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే రాజమౌళి గారితో ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని అప్పుడే అనుకున్నానని ఆయన తెలిపారు. ఇక రాజమౌళి సినిమాలు ఓ రేంజ్ లో ఉంటాయి కాబట్టి ఆయనతో తీసిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి.. కాబట్టి మేము కూడా ఈ సినిమా సక్సెస్ సాధిస్తాము అనే నమ్మకము ఏర్పడింది.
ఈ క్రమంలో తనకి మార్వాల్ సినిమాల అంటే ఇష్టమని అలాంటి సినిమాలు చేయాలని ఉంది. తనకే కాదు నా ఫ్యాన్స్ కూడా నన్ను అలాగే చూడాలనుకుంటున్నారని ఎన్టీఆర్ మాటల్లో తెలియజేశారు..నాకు ఐరన్ మ్యాన్ అంటే ఇష్టం అలాంటి క్యారెక్టర్ నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది అంటూ తన మనసులో ఉన్న కోరికను ఎన్టీఆర్ ఈ సందర్భంలో బయటపెట్టారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ ను ప్రశ్నించిన రిపోర్టర్ ను సర్ప్రైజ్ చేయడం జరిగింది..ఈరోజు మీ బర్తడే కదా అంటూ తనకు విషెస్ చెప్పడమే కాకుండా తన తరపున ఒక గిఫ్ట్ను కూడా ఇచ్చి ఎన్టీఆర్ను సర్ప్రైజ్ అయ్యేలా చేశాడు.