తెలుగు వారి ఉనికిని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. నటుడుగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని విమర్శలు కూడా వచ్చాయి. ఈ విషయంపై ఎప్పుడు మాట్లాడాలని బాలకృష్ణ.. తాజాగా అన్ స్టాపబుల్ షోలో మాట్లాడాడు.
తాజాగా అఖండ మూవీ తో ఘన విజయాన్ని అందుకున్న చిత్ర యూనిట్ సభ్యులు.. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లోకి ప్రగ్యా జైస్వాల్, బోయపాటి శ్రీను, శ్రీకాంత్ డైరీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాల్గొన్నారు.. ఇక ప్రగ్యా జైస్వాల్ తో కలిసి స్టెప్పులు కూడా వేశారు బాలకృష్ణ. అంతేకాకుండా డైలాగులతో ప్రేక్షకులను బాగా అలరించారు బాలయ్య. అయితే ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై స్పందించాడు. ఆ మాట ప్రతి ఒక్కరు ప్రతి సారి అంటుంటే చాలా బాధ వేస్తుంది అంటూ బాలయ్య ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని.. ఆయన ఫ్యాన్స్ లో ఒకడిని అంటూ ఎమోషనల్ అయ్యారు బాలకృష్ణ. ఆ వీడియో డిసెంబర్ 10వ తేదీన ప్రసారం కానుంది.