టాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగుతున్న హీరో ఎన్టీఆర్.. ఇక అతని సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా, నటుడుగా బాగానే సినీ ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్నాడు. కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం జై లవకుశ.. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేయడం గమనార్హం. ఈ సినిమాలో ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచే అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఈ సినిమాని కూడా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన మంచి విజయాన్ని అందుకున్నారు.
ఖమ్మంలోని సోదరుడి బ్యానర్ లో మరికొన్ని సూపర్హిట్ చిత్రాలు చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికి అప్పట్లో కళ్యాణ్రామ్ సోలో హీరోగా నటించడం తగ్గించుకొని ఎన్టీఆర్తో కలిసి భారీ చిత్రాలకు నిర్మాతగా మారే అవకాశం ఉందని వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలు మొదలుకావడం.. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీ కావడంతో ఈ అంశం అందరూ మర్చిపోయారు. కరోనా కారణంగా కూడా సినిమాల షెడ్యూల్ ఆలస్యం కావడంతో కొన్ని ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళి పోయాయి. కాకపోతే అన్నదమ్ముల కలయికలో వచ్చిన సినిమాలు అన్నీ సక్సెస్ కావడంతో వీరిద్దరు కలిసి సినిమాలు చేసే అవకాశం ఉందని సమాచారం.