ఎన్టీఆర్, రాజమౌళి తో కలిసి ముంబైలో ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ , రాజమౌళి పలు ఈ విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ కూడా రాజమౌళి గురించి మాట్లాడుతూ.. రాజమౌళి ఒక డైరెక్టర్ మాత్రమే కాదు మంచి ఆప్తుడు కూడా.. నేను సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేని సమయంలో నాకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చిన ఘనత ఈయనకే దక్కింది అని వెల్లడించాడు. ఇకపోతే అజయ్ దేవగన్ గురించి మాట్లాడుతూ.. అజయ్ దేవగన్ తో పని చేస్తున్నప్పుడు ఒక గురువు నా దగ్గర పని చేసినంత అనుభూతి కలిగింది. ఆయనతో పని చేయాలి అంటే అదృష్టం ఉండాలి. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను అంటూ ఎన్టీఆర్ తెలిపాడు.
అజయ్ దేవగన్ హీరోగా నటించిన పూల్ ఔర్ కాంటే సినిమాలో రెండు బైకుల మీద ఆయన చేసిన స్టంట్స్ చూసి నేను షాక్ ఐపోయాను. సరే నా సినిమాలో నేను చేయాలని అనుకున్నాను. ఇదే విషయాన్ని అమ్మతో చెబితే సినిమాలలో మాత్రమే అలా జరుగుతుందని ..నిజజీవితంలో అవన్నీ చేయడం కుదరదు అని నన్ను హెచ్చరించింది. అంతే కాదు నాతో వారించింది కూడా. అమ్మ చెప్పినందుకు నేను ఏం చేయలేక పోయాను అంటూ తెలిపాడు.