NTR..తెలుగు ఇండస్ట్రీకి వన్నెతెచ్చిన హీరో సీనియర్ ఎన్టీఆర్(NTR ) ఈయన నటించిన ఎన్నో సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయంటే థియేటర్ల ముందు క్యూ కట్టేవారు ప్రేక్షకులు. అంతేకాకుండా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు సంపాదించుకున్నారు ఎన్టీఆర్.. ఎన్నో జానపద, పౌరాణిక ,సాంఘిక ప్రేమ కథ చిత్రాలలో నటించారు. బ్రహ్మంగారి చరిత్ర సినిమా చూస్తే మాత్రం బ్రహ్మంగారే దిగొచ్చినట్టు కనిపించారు. అంతటి నటన సీనియర్ ఎన్టీఆర్ ది
ఇక సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో బాలకృష్ణ అయితే ఈయన సినిమాల్లోకి మొదట ఎక్కువగా తండ్రి సినిమాల్లోనే నటించేవారు. తండ్రితో పాటు బాలకృష్ణ కి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అదే సమయంలోనే బాలకృష్ణకి ,వసుంధర దేవి తో పెళ్లి చేయాలని అనుకున్నారట. కానీ బాలకృష్ణ పెళ్ళికి సీనియర్ ఎన్టీఆర్ అలాగే హరికృష్ణ రాలేదట. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలకృష్ణకి ,వసుంధర దేవి అనే అమ్మాయితో సీనియర్ ఎన్టీఆర్ పెళ్లి నిశ్చయం చేశారు. అయితే వసుంధర దేవిని రామోజీరావు ఇంట్లో చూశారు సీనియర్ ఎన్టీఆర్. ఆమెను చూసినప్పటినుంచి నాకు కొడుక్కి భార్యగా ఈమెనే కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి రామోజీరావు ద్వారా తన తల్లిదండ్రులకు చెప్పి వసుంధర దేవిని బాలకృష్ణ ఇచ్చి పెళ్లి చేశారు.
అయితే బాలకృష్ణ పెళ్లికి సీనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం ఏమిటంటే అప్పటికే సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టి రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. అంతేకాకుండా హరికృష్ణ కూడా తన తండ్రి తో పాటు బిజీగా గడుపుతూ పెళ్లికి రాలేకపోయారు. బాలకృష్ణ పెళ్ళికి వారిద్దరు లేకపోయినా తన కుటుంబం మొత్తం దగ్గరుండి వివాహం జరిపించారు. అంతేకాకుండా పెళ్లి పెద్దగా రామోజీరావు వీరి వివాహాన్ని దగ్గరుండి మరి జరిపించారు. అలా వీరిద్దరూ లేకుండానే బాలయ్య వసుంధరాల పెళ్లి జరగడం జరిగింది.