యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమాలతోనే కాదు యాడ్స్ తో కూడా తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. ముఖ్యంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న తారక్ ఐ.పి.ఎల్ సీజన్ అంతా యాడ్స్ తో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు ఐపిఎల్ తర్వాత ప్రో కబడ్డీకి తారక్ హోస్ట్ గా ఉంటున్నాడు. ఐపిఎల్ వల్ల ప్రో కబడ్డీకి క్రేజ్ పెరిగింది. ఇక తారక్ వంటి స్టార్ ప్రమోట్ చేస్తే ఆ ఆట మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ నెల 20 నుండి స్టార్ మాలో గ్రాండ్ గా ప్రో కబడ్డి మొదలవుతుంది.
ప్రో కబడ్డి గురించి స్టార్ మా ఓ చిన్న టీజర్ వదిలింది. ఆట ఏదైనా అదరగొట్టే తారక్ ఈ టీజర్ లో కూడా ఆట కాదు వేట ప్రో కబడ్డి అంటున్నాడు. ఈ ప్రో కబడ్డి టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారక్ ఏం చేసినా అదో సంచలనమే అందుకే స్టార్ మా ఇలా టీజర్ రిలీజ్ చేసిందో లేదో అలా ఈ వీడియో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న ఎన్.టి.ఆర్ ఆ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో తారక్ తో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి నటిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.