ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎన్టీఆర్ పోస్టర్ అదుర్స్ …!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా ఇండియన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ గురించి మనందరికీ తెలిసిందే. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నం చేశారు రాజమౌళి. ఇందులో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమరం భీంగా తారక్ కనిపించనున్నారు.

డిసెంబర్ 3న విడుదల చేయాల్సిన ఈ సినిమా ట్రైలర్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం తో పాటు కొన్ని కారణాల వలన వాయిదా పడింది. అయితే మరో మూడు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల ఉంటుందని ఎన్టీఆర్ షో లో ఒక పిక్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ కండలు తిరిగిన దేహంతో, ఒంటినిండా రక్తపు మరకలతో స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక డిసెంబర్ 9న ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Share.