యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెర మీద మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా తనదైన మార్క్ చూపించారు. సిల్వర్ స్క్రీన్ పైనే ఎలా అయితే రికార్డులు బద్దలు కొట్టారో స్మాల్ స్క్రీన్ పై కూడా అలానే ఆల్ టైమ్ రికార్డ్ సృషించారు.మా టీవిలో ప్రసారమైన అతిపెద్ద తెలుగు రియాలిటీ షో అయిన బిగ్ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యహరించి టీఆర్పీ రేటింగ్ రికార్డు ను సెట్ చేసిన ఘనత యంగ్ టైగర్ దే. మళ్ళీ కొంత గ్యాప్ తరువాత ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరులు షోకి హోస్ట్ గా వ్యవహరించారు.
అయితే ఈ షోకి కూడా తనదైన శైలిలో హోస్టింగ్ చేసి టాప్ రేటింగ్ రికార్డుని రాబట్టాడు తారక్. ఈ షోకి గాను మొత్తం ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ రేటింగ్స్ తో కలిపి యావరేజ్ గా 4.04 రేటింగ్ వచ్చిందని తెలుస్తుంది. ఈ రేటింగ్ అనేది ఈ షో ఫ్రాంచైజ్ లోనే ఆల్ టైం అధికం అని తెలుస్తుంది. ఈ షోకి ఇంత పాపులారిటీ రావడానికి గల కారణం తారక్ అనే చెప్పాలి.