ఎన్.టి.ఆర్ జీవిత కథతో బయోపిక్ గా వస్తున్న రెండు పార్టులలో మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు బుధవారం రిలీజైంది. ఈ సినిమా ప్రీమియర్స్ హంగామా బాగా ఉంది. మంగళవారం ప్రీమియర్స్ తో ఎన్.టి.ఆర్ కథానాయకుడు 475000ల డాలర్స్ వసూళు చేసిందని తెలుస్తుంది. ఇక ప్రీమియర్స్ తో పాటుగా మొదటి రోజు ఓవర్సీస్ కలక్షన్స్ కూడా భారీగా ఉన్నాయని తెలుస్తుంది. అమెరికాలోనే 475000 డాలర్స్ వసూళు చేసి బాలకృష్ణ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఎన్.టి.ఆర్ నిలిచింది.
అంతకుముందు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా అమెరికాలో 375000 డాలర్స్ ప్రీమియర్స్ ద్వారా కలెక్ట్ చేసింది. ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్.టి.ఆర్ కథానాయకుడు మంచి టాక్ సొంతం చేసుకుంది. ఎన్.టి.ఆర్ జీవితాన్ని క్రిష్ తెర మీద అద్భుతంగా ఆవిష్కరించాడని అంటున్నారు. ఎన్.టి.ఆర్ పాత్రలో బాలయ్య నటన పరిపూర్ణత తెచ్చింది. పతాక సన్నివేశాల్లో అయితే ఇంకా ఆ ఇంప్యాక్ట్ ఎక్కువ చూపించింది. ప్రీమియర్స్ తో సత్తా చాటిన ఎన్.టి.ఆర్ మూవీ రెగ్యులర్ షోస్ తో కూడా రచ్చ మొదలుపెట్టింద్.
80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 10 నుండి 10 కోట్ల షేర్ రాబట్టి ఉండొచ్చని అంటున్నారు. సంక్రాంతి సీజన్ అందునా సినిమా టాక్ పాజిటివ్ గా ఉంది కాబట్టి సినిమా తప్పకుండా అదరగొట్టడం ఖాయం. ఇక రానున్న మిగతా సినిమాల ప్రభావం కూడా ఈ సినిమాపై పడుతుందని చెప్పొచ్చు.