ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఇప్పటికే సక్సెస్.. అదెలా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ కథానాయకుడు సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఈరోజు రాత్రి నుండే ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. యూఎస్ లో భారీగా ఈ సినిమా రిలీజ్ కు సన్నాహాలు జరిగాయి. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వస్తుంది. ఈ సినిమా ఎలా ఉన్నా బాలకృష్ణ విజయం సాధించినట్టే.

పెద్దాయన బయోపిక్ ను ప్రేక్షకుల్లో ఈ రేంజ్ లోకి తీసుకెళ్లిన బాలయ్య సినిమా కేవలం హిట్టు ఫ్లాపుల కోసం కాకుండా తన సంతృప్తి కోసం చేశాడు. అందుకే సినిమా బిజినెస్ లెక్కలేమి పట్టించుకోకుండా బయ్యర్లను మరి ఇబ్బంది పెట్టకుండా రిలీజ్ చేస్తున్నారట. ఎన్.టి.ఆర్ కథానాయకుడు మీద అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో బాలకృష్ణతో పాటుగా సుమంత్, కళ్యాణ్ రాం నటిస్తున్నారు.

ఏపిలో ఇప్పటికే ఎన్.టి.ఆర్ కథానాయకుడు హంగామా మొదలైంది. ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న ఎక్సైటింగ్ తో నందమూరి ఫ్యాన్స్ మొదటి షోనే చూసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో మిడ్ నైట్ షోస్ కు పర్మిషన్ లేదు. ఏపిలో మాత్రం అదనపు షోస్ కు పర్మిషన్ తీసుకోనున్నట్టు తెలుస్తుంది.

Share.