‘జూనియర్ ఎన్టీఆర్ ‘ తాతకు తగ్గ మనవాడిలా ఆయన పోలికలే కాదు … ఆయన నట వారసత్వం కూడా సంపాదించి టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈతరం నటులలో ఆహార్యం, అభినయంతో డైలాగులు చెప్పడం, మైమరిపించేల డాన్సులు వేయటం ఇలా అన్ని కళలు సమపాళ్ళలో కలిగిన నటుడు ఎవరన్నా ఉన్నారా అంటే అది జూనియర్ ఎన్టీఆర్ అని తడుముకోకుండా … అంతా చెప్పుస్తుంటారు. అలాగే ఇప్పుడు బాహుబలి హీరో ప్రభాస్ కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో చెప్పేసాడు.
తన సహనటుడు గురించి.,… ప్రభాస్ చాలా గొప్పగానే తడుముకోకుండా చెప్పడం …అందరిని ఆశ్చర్యపరుస్తోంది.టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్స్ లో నంబర్ రేటింగ్ ఇస్తే ఎవరు ముందు ఎవరు వెనకాల అన్నది చెప్పడం కాస్త కష్టమే. కానీ ప్రభాస్ మనసులో ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు.
అది ఎలా అంటే…? కాఫీ విత్ కరణ్ లో ప్రభాస్ ను ఇదే ప్రశ్న అడిగాడు కరణ్. 1,2,3,4 లలో మహేష్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, బన్ని వీళ్లలో నీ రేటింగ్ ఏంటి అని అడిగాడు. అయితే ప్రభాస్ వెనుకా ముందు తడుముకోకుండా నంబర్ 1 ఎన్.టి.ఆర్ అనేశాడు. 2 మహేష్, 3,4 గురించి కాస్త ఆలోచించి బన్ని, చరణ్ అని సమాధానం చెప్పాడు.
ప్రభాస్ మాటల ప్రకారం ఎన్టీఆర్ కి ఆ ఖ్యాతి దక్కడం నిజంగా తారక్ గొప్పతనమే.అయితే…ప్రభాస్ కే కాదు టాలీవుడ్ లో చాలామంది హీరోలకు ప్రభాస్ ఓ రోల్ మోడల్. ఇండ్రస్ట్రీలో ఆల్ రౌండర్ లా పేరుతెచ్చుకున్న తారక్ కి ఎవరికీ లేనంతగా… ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ చెప్పిన సమాధానం కూడా వాస్తవమే.