ఆస్కార్ రేసులో మొదటి స్థానంలో ఉన్న ఎన్టీఆర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇండియా నుంచి మొదటిసారిగా ఆస్కార్ రేస్ లో చివరి ఫైనల్ స్టేజ్ వరకు RRR సినిమా ఈసారి కచ్చితంగా వెళుతుందని అందరూ భావించారు.అయితే ఇప్పటికే నాటు నాటు సాంగుకి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా ఎంపిక అవడం జరిగింది. ఇక ప్రతిష్టాత్మకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఆస్కార్ కి అడుగు దూరంలో RRR సినిమా ఉందని మాట వినిపిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా ఆస్కార్ చరిత్రలో ఎన్నడు లేని విధంగా మొదటిసారి అత్యధికంగా ఓటింగ్ జరిగిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Jr NTR for Oscars? Leading US publication predicts Academy Award nomination  for the star's performance in RRR

అయితే ఇంతటి క్రేజ్ అంతా ఎక్కువగా RRR సినిమాకే ఈ ఓటింగ్ కూడా పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. పలు విభాగాలలో ఆస్కార్ బరిలో RRR పోటీ పడుతోంది టాప్ లిస్టులోకి కూడా ఈ మూవీ ఇప్పటికే చేరిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఆస్కార్ బరిలో బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నలుగురు నటులను ఎంపిక చేసినట్లుగా USA టుడే లైఫ్ అనే వెబ్సైట్ తెలియజేసింది. ఈసారి ఆస్కార్ నామినేషన్లు బ్రిలియంట్ పర్ఫామెన్స్ తో టాప్ లో పోటీ పడే వారిలో హాలీవుడ్ నటులు కూడా ఉన్నారని తెలుస్తోంది.

వీరితో పోటీపడుతూ నెంబర్ వన్ పొజిషన్కు ఎన్టీఆర్ నిలబడడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని ఈ వెబ్సైట్ ద్వారా అంచనా వేస్తోంది. యానిమల్ ఫైట్ ఎపిసోడ్ తో పాటు మోటార్ బైక్ షార్ట్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ కావడం చేత టాప్ లో ఉన్నారని ఆ వెబ్సైట్ ట్విట్టర్లో తెలియజేసింది. మరి నిజంగానే తారకుకి ఆస్కార్ వస్తే మాత్రం అది ఇండియన్ చరిత్రలోనే కచ్చితంగా అద్భుతం అని చెప్పవచ్చు.

Share.