NTR: మొదటిసారి కోటి రూపాయలు ఎన్టీఆర్ ఏ చిత్రానికి అందుకున్నారంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ప్రేక్షకులకు మొట్టమొదటగా నిన్ను చూడాలని సినిమాతో పరిచయమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. అంతకుముందు రెండు మూడు సినిమాల్లో నటించిన ఈ సినిమాకు వచ్చినంత క్రేజ్ రాలేదు. అప్పట్లో ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే నిన్ను చూడాలని సినిమాకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడట .అప్పట్లో ఈ సినిమా రెమ్యూనరేషన్ వేల రూపాయలు ఉండేదట. అలా మొదటిసారిగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు లక్షల్లో రెమ్యూనేషన్ అందుకున్నారు ఎన్టీఆర్.ఎన్టీఆర్ ఆ తరువాత వచ్చిన సుబ్బు, ఆది సినిమాలకు కూడా ఎన్టీఆర్ చాలా తక్కువగానే తీసుకున్నట్లు సమాచారం.

Start of something big? 'RRR' actor Jr NTR meets top Marvel Studios  executive - BusinessToday

ఇక ఆది సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే .ఆ సినిమాతోనే ఎన్టీఆర్ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ కి అవకాశాలు వెళ్ళబడ్డాయి. ఆ తర్వాత అల్లరి రాముడు, నాగ సినిమాలకు కోటికి పైగా రెమ్యూనికేషన్ తీసుకున్నాడు. ఆ తరువాత తీసిన సింహాద్రి సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పటినుంచి టాలీవుడ్ స్టార్ హీరోలకు పోటీ నిలిచేలా రెమ్యునేషన్ విషయంలో టాప్ -5 లో ఒకరిగా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్

ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన సినిమా RRR ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ గా నిలిచాడు . అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా ఏకంగా ఆస్కార్ అవార్డును అందుకున్నాడని కథనాలు వచ్చాయి. RRR సినిమాలో ఎన్టీఆర్ నటించిన భీమ్ పాత్రకు ఎన్టీఆర్ చాలా కష్టపడ్డాడు అనడంలో సందేహం లేదు. అలాంటి ఎన్టీఆర్ కి రాబోయే రోజుల్లో ఒక్కొక్క సినిమాకు ఏకంగా రూ .100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక చిత్రానికి రూ .60 నుంచి 70 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.

Share.