Ntr..టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ (Ntr )ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే… జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల పెళ్లి దశాబ్దం దాటిన కూడా చాలా అన్యోన్యంగా ఆదర్శంగా నిలుస్తున్నారు.. వీరి పెళ్లి ఎలా జరిగింది. ఎవరు జరిపించారో చాలామందికి తెలియక పోవచ్చు… జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చి హీరో అయినా ఇండస్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే ఎదిగాడు. ఎప్పుడైతే ఆయన స్టార్ హీరోగా ఎదిగాడో అప్పుడు నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ని చేరదీసింది.
ఇక తాతకు తగ్గ మనవడుగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కి 28 సంవత్సరాలు వచ్చిన తరువాత వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజకీయ ప్రచారాల్లో బిజీగా ఉండేవారు. ఆ టైంలో స్వయంగా చంద్రబాబు నాయుడు కల్పించుకొని తన బంధువుల అమ్మాయి అయినా లక్ష్మీ ప్రణతిని ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పారట.
అయితే అప్పటికి ప్రణతి ఏజ్ 18 సంవత్సరాలు మాత్రమే ఈమె శ్రీనివాసరావు మల్లికళ కుమార్తె.. చంద్రబాబు నాయుడుకి మల్లికా దగ్గరి బంధువు కావటంతో జూనియర్ ఎన్టీఆర్ ,లక్ష్మీ ప్రణతి బాగా సెట్ అవుతుందని చంద్రబాబు నాయుడు భావించి వీరి పెళ్లి మే 5 న 2011లో దగ్గరుండి జరిపించారు.వీరి పెళ్లి అప్పట్లో ఏ సెలబ్రిటీ పెళ్లి కూడా జరగనంత అంగరంగ వైభవంగా జరిపించారు. వీరి పెళ్లికి సెలబ్రిటీలే కాదు. రాజకీయ నాయకులు కూడా విచ్చేసి ఈ దంపతులను ఆశీర్వదించారు. ఇలా వీరిద్దరి పెళ్లికి పెద్దగా చంద్రబాబు నాయుడు ఉండటం గమనార్హం. అయితే వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించడమే కాకుండా.. నందమూరి కుటుంబంలోని ఎవరు లేని స్టార్డమ్ ని సంపాదించారు.. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి కొన్ని కోట్ల రూపాయలు అందుకుంటూ ఉన్నారు ఎన్టీఆర్. ఇక అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.