అజ్ఞతవాసి పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న సినిమా ” అరవింద సమేత వీర రాఘవ ” తొలిసారి పూజ హేగ్దే ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తుంది. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ ని డైరెక్టర్ గా ఫైనల్ చేయగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ కి గురైయ్యారు. దానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞతవాసి భారీ డిజాస్టర్ కావటమే. ఈ సినిమా మాటల మాంత్రికుడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. ఇక వెంటనే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానికి త్రివిక్రమ్ డైరెక్టర్ అని అనౌన్స్ చేయగానే ఎన్టీఆర్ అభిమానులు కంగారు పడ్డారు.

ఇక తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ తొలిసారి అజ్ఞతవాసి సినిమా రిజల్ట్ పై విలేకరి అడిగిన ప్రశ్నకి తన సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ” అజ్ఞతవాసి సినిమా ప్రభావం అరవింద సమేత పైన ఉంటుందంటే నేను నమ్మను, ప్రతి సినిమా ఒక కొత్త జర్నీ. ప్రతి డైరెక్టర్ కి జయాలు, అపజయాలు అనేవి సర్వ సాధారణం. నేను కూడా నా కెరీర్ లో అనేక ప్లాప్ సినిమాలు చేశాను, కానీ ఎప్పుడు వాటి ప్రభావం నేను చేసే తదుపరి సినిమా పై పడలేదు. ” అరవింద సమేత ” పూర్తిగా దర్శకుడు త్రివిక్రమ్ సినిమా..నేను అందులో ఒక భాగం మాత్రమే. త్రివిక్రమ్ నాకు ఒక అద్భుతమైన కథ చెప్పారు, విన్నవెంటనే ఓకే చెప్పను. ఇక ఈ సినిమాలోని పాత్రలు చిరకాలం ప్రేక్షకులకి గుర్తుండి పోతాయ్ అని ఎన్టీఆర్ తెలిపారు.
అరవింద సమేత ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 11 వ తేదీన విడుదల కానుంది.

Share.