రకుల్, పాయల్, హాన్సిక.. ఎన్.టి.ఆర్ బయోపిక్ రేంజ్ పెరుగుతుంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు గ్లామర్ టచ్ పెరుగుతుందని చెప్పొచ్చు. సినిమాలో ఇప్పటివరకు విద్యాబాలన్, రకుల్ మాత్రమే ఉన్నారనుకోగా లేటెస్ట్ గా ఆరెక్స్ భామ పాయల్ రాజ్ పుత్ తో పాటుగా క్రేజీ బ్యూటీ హాన్సిక కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఈ ఇద్దరు జయసుధ, జయప్రద పాత్రల్లో కనిపిస్తున్నారట.

ఎన్.టి.ఆర్ తో జయసుధ, జయ ప్రద సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సో సినిమాలో పాయల్, హాన్సికలకు మంచి పాత్రలే దొరికాయని చెప్పొచ్చు. ఆల్రెడీ శ్రీదేవిగా రకుల్ లుక్ రిలీజ్ చేసి మెప్పించారు. ఆరెక్స్ 100 తో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిన పాయల్ జయసుధ పాత్రలో నటించడం విశేషం.

ఇక చాన్నాళ్లుగా తెలుగు తెర మీద కనిపించని హాన్సిక జయప్రద పాత్రలో కనిపించి అలరించనుంది. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు గ్లామర్ టచ్ బాగానే ఉందని చెప్పొచ్చు. వీరంగా ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు సినిమాలోనే ఉంటారని తెలుస్తుంది. వీరితో పాటుగా కళ్యాణ్ రాం, రానా, సుమంత్ లాంటి స్టార్స్ కూడా ఈ బయోపిక్ లో నటిస్తున్నారు.

Share.