ఎన్టీఆర్ బైక్ ఎత్తడం పై ట్రోల్ చేసేవారికి అదిరిపోయే సమాధానం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

 మెగా స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న చిత్రం RRR ఈ సినిమా గురువారం రోజున విడుదలై యూట్యూబ్ లో సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. ట్రైలర్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్స్ అదిరిపోయాయి. ఇక ఈ ట్రైలర్ చూసిన అభిమాను లు సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ లో ఒక సీన్ లో ఎన్టీఆర్ బైక్ ను అమాంతం భుజం పైకి ఎత్తుకుంటాడు. ఆ సీన్ మాత్రం ఆయన అభిమానులను విజిల్స్ వేయించేలా చేస్తున్నాయి.. కానీ కొంతమంది మాత్రం అలా ఎలా ఎత్తుకుంటాడు అబ్బా అంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దిగారు.

ఇక అసలు విషయం ఏమిటంటే ఆ బైక్ కేవలం 56 కేజీలు మాత్రమే ఉంటుందట. ఇలాంటి బైక్లను యుద్ధసమయంలో సైనికులు వాడేవారట. ఈ బైక్ 1939-1945 మధ్యకాలంలోని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వారు సైనికుల కోసమే ప్రత్యేకంగా తయారు చేశారట. ఇక ఆపై కొన్ని ఈ సినిమాలో వాడినట్లు సమాచారం. అందుచేతనే ఆ బైక్ ను ఎన్టీఆర్ అవలీలగా పెట్టుకున్నాడని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ పెట్రోలింగ్ చేసే వారికి సరైన సమాధానం దొరికిందని కొంతమంది భావిస్తున్నారు.

Share.