అక్కడ పని పూర్తి చేసిన ఎన్టీఆర్?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగులో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్‌లో ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఒకటి. ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నందమూరి తారక రామారావు జీవితాన్ని వెండితెరపై చూసేందుకు నందమూరి అభిమానులు ఆశగా చూస్తున్నారు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో తనయుడు బాలకృష్ణ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఒక ఎన్నారై నిర్మాత భారీ రేటుకు ఎన్టీఆర్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారట చిత్ర యూనిట్. దీంతో మొదటి భాగానికి రూ.10 కోట్ల రేటుకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే ఎన్టీఆర్ బయోపిక్‌కు మంచి డీల్ కుదిరిందని చెప్పాలి. ఇక రెండో భాగానికి కూడా రూ.10 కోట్లు రావడం పక్కా అని ఇండస్ట్రీ టాక్.

మొత్తంగా ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతలకు కేవలం ఓవర్సీస్ హక్కుల రూపంలోనే రెండు భాగాలకు కలిపి రూ.20 కోట్లు రానున్నాయన్నమాట. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆతృత ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడే మొదలయ్యింది.

Share.