యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజ హేగ్దే జంటగా నటించిన చిత్రం ” అరవింద సమేత ” ఆడియో ఈ రోజు విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చిత్రం పై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయ్. ముఖ్యంగా ‘ పెనీవిటి ‘ సాంగ్ అన్ని వర్గాల ప్రజలకి నచ్చటం విశేషం. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కి టాలీవుడ్ సెలబ్రిటీస్ నుండే కాకుండా సినీ అభిమానుల నుండి కూడా ప్రశంసలు రావటం విశేషం.
ఇక ఈ రోజు విడుదలైన సినిమాలోని మిగిలిన పాటలు కూడా ప్రేక్షకులని మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలరిస్తాయని ఆశిస్తున్నారు సినిమా ప్రొడ్యూసర్స్.
త్రివిక్రమ్ తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి పని చేయటం తో ఇండస్ట్రీ లోనే కాకుండా ట్రేడ్ లో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఎర్పడ్డాయి. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి స్వరాలూ అందించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ఎస్ రాధా కృష్ణ ఈ సినిమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అరవింద సమేత ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.