నోటా విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న నోటాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరొకండకు ఇది తొలి ద్విభాషా చిత్రం. ఒకేసారి తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ చిత్రం. తమిళ్ వర్షన్ లోనూ విజయ్ సొంత డబ్బింగ్ చెప్పుకున్నారు. మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది.
గత కొన్ని రోజులుగా ఈ చిత్రం విడుదల పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయ్, నిన్న తాజాగా హీరో విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయాలో మిరే నిర్ణయించండని ఒక పోల్ పెట్టారు. అందులో అత్యధిక ఓటింగ్ అక్టోబర్ 5 అని రావటంతో అదే తేదీ కన్ఫర్మ్ చేసారు.