విజయ్ దేవరకొండ హీరోగా తొలిసారి ఒక రాజకీయ నాయకుడిగా నటించిన సినిమా ” నోటా “. మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా సామ్ సంగీతం అందించారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5 న విడుదలైన నోటా ప్రేక్షకుల నుండి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ తో మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చిన లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందనేది వేచి చూడాలి.
యూ ఎస్ ఏ లో ఈ సినిమా తొలి రోజు 1,88,895 డాలర్లు వసూలు చేసిందని సమాచారం.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు రూ 7.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
ఏరియా వైజ్ కలక్షన్స్
నైజాం – 1.93 కోట్లు
సీడెడ్ – 63 లక్షలు
వైజాగ్ – 51 లక్షలు
ఈస్ట్ – 33 లక్షలు
వెస్ట్ – 23 లక్షలు
కృష్ణా – 30 లక్షలు
గుంటూరు – 42 లక్షలు
నెల్లూరు – 20 లక్షలు
ఏపీ, తెలంగాణ షేర్ – రూ 4.55 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.60 కోట్లు
ఓవర్సీస్ – 1 .20 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ – 7.3 కోట్లు