నా కొడుకుతో ఎలాంటి సంబంధం లేదు.. రవితేజ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ధమాకా హిట్టుతో ఫుల్ జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం రావణాసుర సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆయన రావణాసుర ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ తన కొడుకు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్.. రవితేజ అలాగే సుశాంత్ ని ఇంటర్వ్యూ చేయగా ఇంటర్వ్యూలో హరీష్ శంకర్, రవితేజ కొడుకు గురించి మాట్లాడుతూ.. మీ అబ్బాయి ఎప్పుడు సినిమాల్లోకి రాబోతున్నారు అంటూ అడిగారు.

Ravi Teja's son Mahadhan signs his Second

దానికి రవితేజ స్పందిస్తూ.. అసలు వాడికి నాకు సంబంధం లేదు.. ఎందుకంటే అసలు వాడు సినిమాల్లోకి వస్తాడో రాడో కూడా నాకు తెలియదు. నా కొడుకు మహాదన్ సినిమాలోకి రావచ్చు.. రాకపోవచ్చు.. ఇంట్రెస్ట్ ఉందా లేదా అని నేను మాత్రం చెప్పలేను. వాడికి ఒక క్లారిటీ ఉంది. సినిమాల్లోకి రావాలో వద్దో అనేది వాడి ఇష్టం. ప్రస్తుతం వాడి ఫోకస్ మొత్తం స్టడీస్ పైనే పెట్టాడు. తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.. పెద్దయ్యాక ఒకవేళ సినిమాలంటే ఇష్టం ఉంటే ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తాడు. అందుకు నేను కూడా సపోర్ట్ చేస్తాను..

Ravi Teja on his son turning Idiot 2 | cinejosh.com

లేకపోతే తనకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అటువైపే వెళ్తాడు.. అయితే కచ్చితంగా వాడు సినిమాల్లోకి వస్తాడని మాత్రం నేను చెప్పలేను.. ఒకవేళ సినిమాల్లోకి వస్తానంటే అడ్డు చెప్పను ప్రోత్సహిస్తాను అంటూ కామెంట్లు చేశారు రవితేజ. మొత్తానికి అయితే రవితేజ కొడుకు త్వరలోనే ఎంట్రీ ఇస్తున్నారు అంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Share.