స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నారనే దాని గురించి నేను బాధపడను.. ప్రేమ విలువ తెలియని వారికి ఎంతమందితో సంబంధం ఉన్నా.. వారికి కన్నీళ్లే మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి.. తన ప్రవర్తన మార్చుకొని ఆ అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది.. అంటూ సమంత చెప్పినట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే సమంత వీటిని ఖండించింది.. తాను ఎప్పుడూ ఇలా చెప్పలేదని అదంతా పుకార్లే అని కొట్టిపారేసింది.
ఇటీవల ఈ వార్తను రాసిన ఒక పోర్టల్ లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ను ఆమె ట్వీట్ చేస్తూ ఇలా వ్యాఖ్యానించింది. నాగచైతన్య శోభిత ధూళిపాళ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరి రిలేషన్షిప్ గురించి రకరకాల వార్తలు చెక్కర్లు కొడుతున్న నేపథ్యంలోనే సమంత..నాగచైతన్యను ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించింది అంటూ పుకార్లు రావడంతో వాటిని ఆమె ఖండించింది. వాస్తవానికి గత ఏడాది కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న సమంత.. తనకు నాగచైతన్యకు మధ్య సంబంధాలు అంత స్నేహపూర్వకంగా లేవు అని.. తనను నన్ను ఒకే గదిలో కలిపి ఉంచకండి అని.. ఒకవేళ ఉంచితే కత్తులు, కటార్లు లేకుండా చూసుకోవాలని చెప్పి ఆమె వ్యాఖ్యానించింది
ఇక పరస్పర అంగీకారంతోనే 2021లో విడిపోయినట్లు ఆమె తెలిపింది. మొత్తానికి అయితే ఆమె తన భర్త గురించి.. ఆయన ప్రేమాయణం గురించి స్పందించకపోయినా.. కొంతమంది ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ మండిపడింది. ఇకపోతే ప్రస్తుతం సమంత ఖుషి చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఆమె నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మరొకవైపు నాగచైతన్య తెలుగు, తమిళ్ భాషలో కస్టడీ సినిమాను చేస్తున్నారు.